ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది
బ్యాగ్‌లు.. వేల సంఖ్యలో షూట్ కేసులు.. ఇవీ ఓ ఎయిర్‌పోర్టులో దృశ్యాలు. వీటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
బ్యాగ్‌లు.. వేల సంఖ్యలో షూట్ కేసులు.. ఇవీ ఓ ఎయిర్‌పోర్టులో దృశ్యాలు. వీటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్-2లోని బ్యాగేజ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ప్రయాణికులకు సంబంధించిన సూట్‌కేసులు, బ్యాగ్‌లు వేల సంఖ్యలో ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి.ప్రత్యేక సిస్టమ్ ద్వారా కాకుండా వారి వారి లగేజీని తీసుకెళ్లేందుకు అక్కడే అనుమతి లేదు. దాంతో అక్కడ బ్యాగ్‌లు ఇలా పేరుకుపోయాయి. ఈ కారణంతో ప్రయాణికులు విమానాశ్రయం నుంచి బయటపడేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jun 30, 2022 09:20 AM