అండర్ గ్రౌండ్‌ డ్రైనేజ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరికెళ్లి చూసిన స్థానికులకు షాక్ !!

Updated on: Jan 27, 2025 | 6:17 PM

ఒకటి కాదు, రెండు కాదు.. వారం రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్నాడు ఓ వ్యక్తి. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజిలోకి అతను ఎలా వెళ్ళాడు. వారం రోజులు అందులో ఎలా ఉన్నాడన్న విషయాలు అతనికి గుర్తులేదు. శుక్రవారం ఉదయం అండర్ డ్రైనేజీ నుంచి శబ్దాలు వినబడటం, అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు అలెర్ట్ అవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి.

మెదక్‌ జిల్లాలోని అవుసులపల్లి గ్రామనికి చెందిన నాగారం మల్లేష్ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా కనిపించటం లేదు. దీనితో అతని కోసం అంతటా వెతికిన కుటుంబ సభ్యులు చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే మల్లేష్ కనపడటం లేదని, పోస్టర్లు అతికించి, వివిధ వాట్సాప్ గ్రూప్‌లలో అతని ఫోటోను షేర్ చేసారు. అందువల్లే ఇతన్ని బయటకు తీసిన తర్వాత తను ఎవరు అనే విషయన్ని తొందరగా గుర్తించారు. అయితే మల్లేష్ గత వారం రోజుల క్రితం కుంభమేళాకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో నర్సాపూర్‌కు చేరుకున్నానంటూ కుటుంబీకులకు సమాచారం అందించి.. అనంతరం అదృశ్యమయ్యాడు. కాగా అప్పటి నుంచి వారం రోజులుగా కుటుంబీకులు మల్లేశం కోసం వెదికారు. శుక్రవారం నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అండర్ డ్రైనేజీ పైన ఉన్న సిమెంట్ పలకల మధ్యలో నుంచి చేతులు బయటకు పెట్టడంతో, గుర్తించిన స్థానికులు సురక్షితంగా అతనిని బయటకు తీశారు. అనంతరం అతని గురించి ఆరా తీసారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..! వీటిని అస్సలు తినకూడదట!

దారుణం.. సంతలో అద్దెకు యువతులు, మహిళలు!

ఇక వారానికి నాలుగు రోజులే పని !! వచ్చేస్తోంది కొత్త లేబర్ కోడ్

కేంద్రం గుడ్‌ న్యూస్..! రూ.10 లక్షల వరకూ నో ట్యాక్స్ ?

ఉత్తరాఖండ్‌లో అమలులోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి