Variety Gifts: చదివింపుల విందులో షాకింగ్ కానుకలు.. ఏకంగా రూ.15 కోట్లు వసూలు.! అబ్బురపరిచే వీడియో..
తమిళనాడులోని పుదుక్కోట్టైలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో నిర్వహించిన విందులో కార్యక్రమంలో రికార్డ్ స్థాయిలో చదివింపులు వచ్చాయి. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా..
తమిళనాడులోని పుదుక్కోట్టైలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో నిర్వహించిన విందులో కార్యక్రమంలో రికార్డ్ స్థాయిలో చదివింపులు వచ్చాయి. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా.. విందులో అక్షరాల 15కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దీంతో ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెడువాసల్ కిళక్కు గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. విందుకు హాజరైనవారంతా అక్కడ సిద్ధంగా ఉంచిన పాత్రల్లో తమకు తోచినంత నగదు చదివింపులుగా వేశారు. ఇలా వచ్చిన నగదును నిర్వాహకులు లెక్కించగా, 15కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించారు. అయితే ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటారు తమిళనాడు వాసులు. పుదుక్కోట్టై జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు వ్యవసాయంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో కష్టాల నుంచి గట్టెక్కేందుకు విందు ఏర్పాటుచేసి సుమారు 50వేల ఆహ్వాన పత్రికలను ముద్రించాడు. బంధువులు, స్నేహితులు, స్థానికులతో పాటు ఇతర గ్రామాల్లోనూ పంచాడు. 15 లక్షల రూపాయలు ఖర్చుచేసి రకరకాల ఆహార పదార్థాలు తయారుచేయించాడు. సుమారు 5వేల మంది అతిథులకు ఆప్యాయంగా వడ్డించాడు. కృష్ణమూర్తి ఆతిథ్యంతో ఖుషీ అయిన అతిథులు కళ్లు చెదిరే రీతిలో చదివింపులు చెల్లించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

