రూ. 8 లక్షల కారులో వచ్చి.. రూ. 8 పేపర్‌ను దొంగిలించాడు
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో విచిత్ర దొంగతనం వెలుగుచూసింది. ఖరీదైన కారులో వచ్చిన వ్యక్తి లాయర్ ఆఫీసు ముందున్న వార్తాపత్రికను దొంగిలించాడు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. న్యాయవాది సంజీవ్ బిల్గయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఆ పేపర్ దొంగను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. లాయర్ ఆఫీసు బయట ఉన్న న్యూస్‌పేపర్‌ను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్‌పేపర్ దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 12వ తేదీ ఉదయం 9.55 గంటల సమయంలో మహారాణా ప్రతాప్ కాలనీలో న్యాయవాది సంజీవ్ బిల్గయ్య తన కార్యాలయం ఛాంబర్‌లో సహోద్యోగితో ఒక కేసు గురించి చర్చిస్తున్నారు. న్యాయవాది ఛాంబర్ ముందు డిజైర్ కారు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. మెల్లగా రెయిలింగ్ వద్దకు వచ్చాడు. లోపలకు చేతులు పెట్టాడు. అక్కడ ఉన్న వార్తాపత్రికను తీసేందుకు ముందు ప్రయత్నించి విఫలమయ్యాడు. ముందుకు వంగి చేతిని మరింత ముందుకు చాచి ఆ న్యూస్‌పేపర్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కారు ఎక్కి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మరోవైపు అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో రూ 8 లక్షల రూపాయల కారులో వచ్చిన వ్యక్తి 8 రూపాయల ధర ఉండే వార్తాపత్రికను చోరీ చేయడంపై న్యాయవాది సంజీవ్ షాకయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో వచ్చి న్యూస్‌పేపర్‌ను చోరీ చేసిన దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలికాలంలో పెదవులు పలిగిపోతున్నాయా ?? ఇది మీకోసమే
ఇది పిచ్చి మొక్క కాదు.. క్యాన్సర్‌ను అరికట్టే దివ్యౌషధం
10 దేశాల మీదుగా.. 300 ఉప నదులను కలుపుకుంటూ
