China Ship: నౌక ఢీకొని భారీ వంతెన రెండు ముక్కలు.! నదిలో పడ్డ ఒక బస్సు, ఐదు వాహనాలు..
చైనా లో ఓ వంతెనను భారీ నౌక ఢీకొంది.. దీంతో ఒక బస్సు సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. తాజాగా గురువారం ఉదయం 5.30 నిముషాలకు నౌక ఫోష్‌మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది.
చైనా లో ఓ వంతెనను భారీ నౌక ఢీకొంది.. దీంతో ఒక బస్సు సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. తాజాగా గురువారం ఉదయం 5.30 నిముషాలకు నౌక ఫోష్‌మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి లోడు లేదని స్థానిక ప్రభుత్వ మీడియా తెలిపింది. ఆ సమయంలో వంతెనపై ట్రాఫిక్ తక్కువగా ఉంది. ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్యే చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. గాలింపు పూర్తయ్యాకే బాధితుల సంఖ్య తేలనుందని అధికారులు చెబుతున్నారు. పెరల్ నది పరీవాహక ప్రాంతం చైనాలోని రద్దీగా ఉండే జలమార్గాల్లో ఒకటి. ఈ ఘటన జరిగిన నౌకాశ్రయం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. వాస్తవానికి ఈ వంతెనను నౌకలు ఢీకొనే ముప్పు ఉండటంతో నిర్మాణంలో మార్పులు చేయాలని గతంలోనే నిర్ణయించారు. కానీ, ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

