“దృశ్యం” సీన్‌ రిపీట్‌.. పోలీస్‌స్టేషన్ చెత్తకుప్పలో శవాలు లభ్యం

|

Jul 24, 2024 | 7:18 PM

ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి. కెన్యా రాజధాని నైరోబీలో గత రెండేళ్లుగా వరుసగా మహిళలు అదృశ్యమవుతున్నారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పోలీస్‌స్టేషనుకు అతి సమీపంలోని డంపింగ్‌యార్డులో పదుల సంఖ్యలో మహిళల మృతదేహాలు దొరికాయి.

ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి. కెన్యా రాజధాని నైరోబీలో గత రెండేళ్లుగా వరుసగా మహిళలు అదృశ్యమవుతున్నారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పోలీస్‌స్టేషనుకు అతి సమీపంలోని డంపింగ్‌యార్డులో పదుల సంఖ్యలో మహిళల మృతదేహాలు దొరికాయి. అవి సంచుల్లో చుట్టి పడేసి ఉన్నాయి. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషాను ఇటీవల అరెస్టు చేశారు. యూరో 2024 ఫుట్‌బాల్ ఫైనల్‌ను చూడటానికి వెళ్లిన క్లబ్ వెలుపల తెల్లవారుజామున 3 గంటలకు అతన్ని అరెస్టు చేశారు. 2022 నుంచి ఇప్పటిదాకా అతడు 42 మంది మహిళలకు వల వేసి లొంగదీసుకొని.. ఆపై హత్య చేశాడు. మృతదేహాలను ఛిద్రం చేసి డంపింగ్‌యార్డ్‌లో పడేసేవాడు. ఇలా చంపినవారిలో తన భార్య కూడా ఉందని నిందితుడు అంగీకరించాడు. డంపింగ్‌యార్డుకు అతి సమీపంలోనే శిథిలమైన గదిలో నిందితుడు కాలుషా అద్దెకు ఉండేవాడు. అధికారులకు అనుమానం వచ్చి అతడి ఇంటిని తనిఖీ చేయగా.. భారీఎత్తున టేపులు, నైలాన్‌ సంచులు, పరిశ్రమల్లో వాడే రబ్బర్‌ గ్లౌజులు కనిపించాయి. పలు మొబైల్‌ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆమె ముచ్చట విలువ రూ.3 కోట్లు ఎంతైనా హీరోయిన్ కదా

రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్

Tarun: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్‌

Suriya: రూ.350 కోట్ల ఆస్తి.. రూ.70 కోట్ల విల్లా.. అది సూర్య ఆస్తుల రేంజ్‌

TOP 9 ET News: అల్లు అర్జున్, చరణ్‌ మధ్యలో నలిగిపోతున్న నాగ చైతన్య

Follow us on