అవినాష్ గతంలో చైనాలో మెడిసిన్ చేసి హైదరాబాద్‌లో సుమంత్‌ను కలిసి కిడ్నీ మార్పిడి సర్జరీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇక.. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ఆదేశాలతో ఇద్దర్ని రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అయినవారిని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత డిసెంబర్‌లో ఏకంగా 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు తేల్చారు. ఇతర దేశాల్లో మెడిసిన్ చేసిన వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారన్నారు రాచకొండ సీపీ సుధీర్‌బాబు. డొనేట్ చేసిన వాళ్లకు 5 లక్షలు, ఒక్కో సర్జరీకి డాక్టర్ అవినాష్‌కు రెండున్నర లక్షలు ఇస్తున్నారని తెలిపారు.