తాగుబోతు భర్తలతో పడలేక ..ఆ మహిళలు ఏం చేశారో చూడండి!
భర్త రోజూ మద్యం సేవించి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఏ ఇల్లాలైనా ఎంతకాలం భరిస్తుంది అని చాలామంది అంటారు. ఏదో ఒక సందర్భంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా ఇద్దరు మహిళలు తమ భర్తలు పెట్టే హింసలు భరించలేక ఇంటినుంచి వెళ్లిపోయి.. ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో బాధపడుతున్నారు. వారి వారి భర్తలు మద్యానికి బానిసలై రోజూ తాగి వచ్చి ఇంట్లో చేసే రచ్చ చెప్పుకుంటూ బాధపడుతుండేవారు. మద్యం మత్తులో తమ భర్తలు తిట్టే తిట్లను, పెట్టే హింసను ఇక భరించలేమని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. భర్తలతో సంబంధం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకుని వేరే ఊరిలో కలిసి ఉండాలని కవిత, బబ్లూ డిసైడ్ అయ్యారు. ఆపై ఇద్దరూ ఇల్లు వదిలి గోరఖ్ పూర్ చేరుకున్నారు. మహిళలు ఇద్దరూ ఓ శివాలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇందులో బబ్లూ పెళ్లికొడుకులా కవిత నుదుట తిలకం దిద్దింది. ఆపై ఇద్దరూ దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. దంపతులుగా మారిన కవిత, బబ్లూ ఇకపై గోరఖ్ పూర్ లోనే ఉంటామని, ఏదైనా పనిచేసుకుంటూ జీవిస్తామని చెప్పారు.
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?

