హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హ్యాపీగా ఎంజాయ్ చేయాలని హనీమూన్ కు బయలుదేరిన కొత్త దంపతుల ప్రయాణం విషాదంగా ముగిసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం వరంగల్ కు చెందిన ఉరుగుండ సాయి గిఫ్ట్ ఆర్టికల్స్ తయారీ సంస్థలో వర్కర్ గా పనిచేస్తున్నాడు. అతనికి మూడు నెలల క్రితం వివాహమైంది. హనీమూన్ కు గోవా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకు రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి గోవాకు వెళ్ళేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అప్పటికే రైల్వే స్టేషన్ లోని తొమ్మిదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైలు ఎదురుగా అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు.
రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్ ఫామ్ పై ఉన్న స్టాల్లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి రైలు దిగి వెళ్ళాడు. అంతలో రైలు బయలుదేరడంతో బోగీలో ఉన్న స్నేహితులు చైన్ లాగారు. రైలు ఆగింది. అక్కడికి వచ్చిన ఆర్ పీఎఫ్ పోలీసులు బోగీలోకి వెళ్లి ప్రశ్నించగా విషయం చెప్పారు. సాయి స్నేహితులైన ఇద్దరు యువకులను పోలీసులు ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చారు. అప్పుడే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని తిరిగి కిందకు వచ్చాడు. అక్కడున్న పోలీసులను ఫైన్ చెల్లిస్తాం అని రైలు వెళ్ళిపోతుంది. వదిలిపెట్టమని ప్రార్థన పడుతుండగా రైలు బయలుదేరింది. రైల్లో భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అదురు వేగంగా వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ కాళ్ళు జారి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో
రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో
వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
