Viral: అంతరిక్షంలో మహా మహా సముద్రాలు గుర్తించిన శాస్త్రవేత్తలు.!

|

Dec 30, 2024 | 11:20 AM

విశ్వం అనంతం. ఇప్పుడు మనం చూస్తున్న గ్రహాలు, కోటానుకోట్ల నక్షత్రాలు, ఎన్నో పాలపుంతలు, సౌరమండలం అంతా కలిపి గోరంతే.. తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం విశ్వమే. అసలు విశ్వం ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నలకు తలపండిన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనలేకపోయారు. కానీ,

తాజాగా అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపైనున్న మహాసముద్రాలకంటే 140 ట్రిలియన్‌ రెట్లు పెద్దగా ఉంటుందట. ఇది ఓ సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌ హోల్‌కు దగ్గరలో ఉంది. మన సూర్యుడి కంటే దాదాపు 20 బిలియన్లు పెద్దగా ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాలోని పసాదేనాలోని నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబోరేటరీ శాస్త్రవేత్తల బృందం దాన్ని గురించింది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌ భూమికి 12 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. విశ్వం ఆవిర్భవించిన కొద్ది కాలానికే ఇక్కడ నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్వాసర్‌ అనే బ్లాక్‌హోల్‌ చుట్టూ ఉన్నది. ఇది వేల ట్రిలియన్‌ సూర్యులకు సమానమైన శక్తిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ ఇదేనంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. క్వాసార్ చుట్టూ ఉన్న వాతావరణంలో నీటి ఆవిరిని సైంటిస్టులు గుర్తించారు. ఆ ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. ఒక కాంతి సంవత్సరం ఆరు ట్రిలియన్‌ మైళ్లకు సమానంగా చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Dec 30, 2024 11:19 AM