బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

|

Feb 20, 2024 | 2:47 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం చాలా అవసరం. ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఇందుకు మాంసం, గుడ్లు, చేపలతోపాటు ప్రొటీన్‌ ఎక్కువగా లభించే కొన్నిరకాల కూరగాయలను సూచిస్తారు. అయితే అందరూ ఈ పౌష్టికాహారాన్ని తీసుకోలేదు. ఇలాంటి వారికి చౌకగా మంచి ప్రొటీన్‌ కలిగిన ఆహారం అందించేందుకు కొరియన్‌ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేసి డైరెక్టుగా బియ్యంద్వారానే ప్రొటీన్‌ అందేలా కొత్తవంగడాన్ని అభివృద్ధి చేశారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం చాలా అవసరం. ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఇందుకు మాంసం, గుడ్లు, చేపలతోపాటు ప్రొటీన్‌ ఎక్కువగా లభించే కొన్నిరకాల కూరగాయలను సూచిస్తారు. అయితే అందరూ ఈ పౌష్టికాహారాన్ని తీసుకోలేదు. ఇలాంటి వారికి చౌకగా మంచి ప్రొటీన్‌ కలిగిన ఆహారం అందించేందుకు కొరియన్‌ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేసి డైరెక్టుగా బియ్యంద్వారానే ప్రొటీన్‌ అందేలా కొత్తవంగడాన్ని అభివృద్ధి చేశారు. దక్షిణ కొరియాలోని యోన్‌సెయ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ధాన్యాన్ని అభివృద్ధి చేశారు. పశు మాంస కండరం, కొవ్వు కణాలతో మిళితమై ఉండటం దీని ప్రత్యేకత. సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఇందులో ప్రొటీన్‌ 8 శాతం ఎక్కువగా ఉంటుంది. పోషక పదార్ధాలతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకు భిన్నంగా ఉంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్‌.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి

హాల్‌టికెట్‌పై ప్రముఖ హీరోయిన్‌ ఫోటో.. అవాక్కయిన స్టూడెంట్‌

టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..

వావ్! వజ్రమా.. భూమా ?? నోవా-సి అద్భుత చిత్రాలు