Algae Battery: నన్ను తక్కువ అంచనా వేయొద్దు.. 6 నెలలు నాన్‌స్టాప్‌ రన్నింగ్‌...

Algae Battery: నన్ను తక్కువ అంచనా వేయొద్దు.. 6 నెలలు నాన్‌స్టాప్‌ రన్నింగ్‌…

Anil kumar poka

|

Updated on: May 22, 2022 | 9:30 AM

కూలర్ బాక్స్ లాగా కనిపించే ఈ వస్తువు ఏంటో మీకు తెలుసా? అసలు విషయం తెలిస్తే షాకవుతారు. నిజానికి ఇదొక బ్యాటరీ. 6 నెలల పాటు కరెంటు ఇచ్చే విధంగా శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి చెందిన కంప్యూటర్ ప్రాసెసర్‌కి


కూలర్ బాక్స్ లాగా కనిపించే ఈ వస్తువు ఏంటో మీకు తెలుసా? అసలు విషయం తెలిస్తే షాకవుతారు. నిజానికి ఇదొక బ్యాటరీ. 6 నెలల పాటు కరెంటు ఇచ్చే విధంగా శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి చెందిన కంప్యూటర్ ప్రాసెసర్‌కి ఈ బ్యాటరీని కనెక్ట్ చేశారు. ఇది 6 నెలలుగా నిరంతరాయంగా పనిచేస్తోంది. ఈ బ్యాటరీ షెల్ AA బ్యాటరీ కంటే చిన్నది. పరిశోధకులు ఈ బ్లూ-గ్రీన్ ఆల్గే ను ఎలక్ట్రోడ్‌లతో కూడిన కంటైనర్‌లో ఉంచారు. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవులు, సూర్యరశ్మిని ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీతో ఓ కంప్యూటర్‌ను ఆరు నెలలపాటు నిరంతరాయంగా నడప వచ్చు. ఆగస్ట్ 2021 నుంచి ఈ బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని, కొన్ని వారాల తర్వాత అది ఆగిపోతుందని భావించాము కానీ నిరంతరాయంగా కొనసాగుతోందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ పాలో బొంబెల్లి తెలిపారు. ఆరు నెలలపాటు అంతరాయం లేకుండా నడిచిన ఈ సిస్టమ్, కంప్యూటింగ్ సమయంలో 0.3 మైక్రోవాట్‌ల శక్తిని, పనిలేని సమయంలో 0.24 శక్తిని వినియోగించుకుందని చెప్పారు.
అయితే, ఇది ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు. కానీ, కిరణజన్య సంయోగక్రియ సమయంలో సైనోబాక్టీరియా (బ్లూ-గ్రీన్ ఆల్గే) ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తుందని బృందం భావిస్తోంది. సూర్య రశ్మి లేని సమ యంలో కూడా విద్యుదుత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. పగలు, రాత్రి సమయాల్లోనూ స్థిరంగా పనిచేస్తూనే ఉందని తెలిపారు. ఈ ఆల్గే-ఆధారిత బ్యాటరీలు ఇంటికి సరిపడా పవర్‌ని ఇవ్వలేవని, చిన్న చిన్న ఉపకరణాలకు సరిపడా పవర్‌ ఇస్తుందని తెలిపారు. రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేశారు కనుక దీని ధరకూడా చాల చౌక అని తెలిపారు. ఇటువంటి బ్యాటరీలు రాబోయే కాలంలో గేమ్ ఛేంజర్‌గా మారగలవని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 22, 2022 09:30 AM