Bear Viral: పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్న ఎలుగుబంటి.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు.

|

Sep 05, 2023 | 9:52 AM

ఇటీవల ఎలుగుబంట్లు, చిరుతపులులు పుణ్యక్షేత్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయంలో దైవదర్శనానికి వచ్చిన భక్తులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన తెలిసిందే. అలిపిరి మెట్ల మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ భక్తులపై దాడులకు తెగబడుతున్నాయి. ఒక్క తిరుమలలోనే కాదు శ్రీశైలం, నంద్యాలలోని మహానంది క్షేత్రాల్లోనూ ఎలుగుబంటి సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల ఎలుగుబంట్లు, చిరుతపులులు పుణ్యక్షేత్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయంలో దైవదర్శనానికి వచ్చిన భక్తులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన తెలిసిందే. అలిపిరి మెట్ల మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ భక్తులపై దాడులకు తెగబడుతున్నాయి. ఒక్క తిరుమలలోనే కాదు శ్రీశైలం, నంద్యాలలోని మహానంది క్షేత్రాల్లోనూ ఎలుగుబంటి సంచరిస్తూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలోని మల్లేశ్వరస్వామి దేవాలయంలో దర్శనమిచ్చింది ఎలుగుబంటి. అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలం మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో రాత్రి ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది. ఎలుగుబంటి ఆలయ ప్రాంగణంలో సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎలుగుబంటి సంచారంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చూస్తుంటే ఎలుగుబంటి పుణ్యక్షేత్రసందర్శన చేస్తున్నట్టుంది. ఏపీలోని ఏ పుణ్యక్షేత్రాన్నీ వదలడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ఆలయంలో దర్శనమిస్తూనే ఉంది. దాంతో భక్తులు జంతువులను త్వరగా పట్టుకోవాలని అటవీ అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..