పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

Updated on: Jan 14, 2026 | 11:20 AM

రేపే భోగి, తర్వాత సంక్రాంతి. పెద్ద పండక్కి జనం ఇప్పటికే ఊర్లకు చేరారు. మిగిలిన వారు ఈ రాత్రికళ్లా వెళ్లిపోతారు. వచ్చే మూడు నాలుగు రోజులు పండగకోసం జనం సిద్ధమవుతున్నారు. అయితే పండక్కి ఇంటికొచ్చిన అల్లుడికి.. బంధువులకు అన్ని వండి పెట్టాల్సిందే. కనుమ, ముక్కనుమ రోజున నాన్‌వెజ్‌ ఆశిస్తారు. అయితే మార్కెట్‌కు వెళ్తే సామాన్యుడి జేబుకు చిల్లుపడకమానదు. భారీ స్థాయిలో చికెట్‌, మటన్‌ రేట్లు పెరిగాయి. విజయవాడలో చికెన్‌ కేజీ 350 రూపాయలకు చేరింది. దీంతో సామాన్యులు పండక్కి మాసం కొనాలంటేనే భయపడే పరిస్థితికి మారింది.

సంక్రాంతికి మాంసం ఎక్కువ తింటూ ఉంటారు. కనుమ రోజు చికెన్, మటన్ వంటివి ఎక్కువ తినే ఆనవాయితీ ఉంది. అలాగే గ్రామ దేవతలకు కోళ్లను మొక్కుల కింద చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి తరుణంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం, డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో చికెన్, మటన్ ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోన్నాయి. గత నెలలో కేజీ చికెన్ ధర రూ.230 నుంచి రూ.240 మధ్య ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.350 వరకు పలుకుతోంది. అటు చికెన్‌తో పాటు మటన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ మటన్ విత్ బోన్ రూ.1050, కేజీ మటన్ బోన్ లెస్ రూ.1250గా ఉంది. సాధారణ రోజుల్లో కేజీ మటన్ రూ.800 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ.వెయ్యికిపైగా చేరుకున్నాయి. పండగ రోజుల్లో మటన్ విక్రయాలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో డిమాండ్ కారణంగా ధరలు పెరిగాయి.

మరిన్ని వీడియోల కోసం :

నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌… మెగాస్టార్‌కి ఊరట!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్

పండగపూట భగ్గుమంటున్న చికెన్‌, మటన్‌ ధరలు

ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..

 

Published on: Jan 14, 2026 11:15 AM