Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్

|

Nov 04, 2023 | 8:31 PM

క్రికెట్ అనగానే.. మొదటగా అందరికి గుర్తొచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌. కొన్ని కోట్ల మంది అభిమానులు ఆయన సొంతం. ఎంతోమందికి ఆయన ఓ ఇన్‌స్పిరేషన్‌. బ్యాట్‌ చేతపట్టి ఆయన గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. ఒకానొక దశలో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు సచిన్. ఎన్నో గొప్ప గొప్ప మ్యాచ్ లను ఆడి ఇండియాకు ఘన విజయాలను అందించారు.

క్రికెట్ అనగానే.. మొదటగా అందరికి గుర్తొచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌. కొన్ని కోట్ల మంది అభిమానులు ఆయన సొంతం. ఎంతోమందికి ఆయన ఓ ఇన్‌స్పిరేషన్‌. బ్యాట్‌ చేతపట్టి ఆయన గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. ఒకానొక దశలో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు సచిన్. ఎన్నో గొప్ప గొప్ప మ్యాచ్ లను ఆడి ఇండియాకు ఘన విజయాలను అందించారు. అలాంటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను భారతీయులంతా క్రికెట్ దేవుడిగా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రికెట్ దిగ్గజాన్ని గౌరవిస్తూ ఆయన విగ్రహావిష్కరణ చేసింది బీసీసీఐ. ఇప్పుడు ఆ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జే షా, సచిన్ కుటుంబ సభ్యులు, వందలాది మంది క్రికెట్ అభిమానులు విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం.. అభిషేకాలు నిలిపివేత

ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం.. వీడియోలు చూపించి మరో యువకుడు

Nepal earthquake: నేపాల్‌ లో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి

Tirumala: తిరుమల ఘాట్ లో కొండచిలువ ప్రత్యక్షం