Batting Viral Video: తన బ్యాటింగ్‌తో సచిన్‌నే భయపెట్టిన బాలిక..! ట్రెండ్ అవుతున్న వీడియో..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... ఈయన ఆటతీరు, ఆయన సాధించిన రికార్డులు, ఆటపట్ల అతనికున్న అంకితభావం కాణంగా ఆయన్ని అందరూ క్రికెట్ దేవుడంటారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్… ఈయన ఆటతీరు, ఆయన సాధించిన రికార్డులు, ఆటపట్ల అతనికున్న అంకితభావం కాణంగా ఆయన్ని అందరూ క్రికెట్ దేవుడంటారు. ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్. అంతటి క్రికెట్ దేవుడ్నే ఆశ్చర్యపోయేలా చేసింది ఓ బాలిక. ఈ విషయాన్ని స్వయంగా సచినే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ వీడియోలో ఓ కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అందులో ఓ బాలిక వచ్చిన ప్రతి బాల్ ను మిస్ కాకుండా చీల్చి చెండాడుతూ చక్కని బ్యాటింగ్ చేసింది. ఈ వీడియోని సచిన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేస్తూ.. ‘‘క్యా బాత్ హై.. నీ బ్యాటింగ్ చూసి నిజంగా ఎంతో ఆనందించాను’’ అంటూ సచిన్ తన స్పందన తెలియజేశారు. నిన్ననే ఐపీఎల్ వుమెన్ వేలం జరిగింది.. ఇవాళే మ్యాచ్ మొదలైపోయిందా ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సచిన్ పోస్ట్ పై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఫిబ్రవరి 14న సచిన్ ఈ పోస్ట్ పెట్టగా, 24 గంటలు కూడా గడవక ముందే 16 లక్షల మంది దీన్ని వీక్షించారు. 62 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..