Russian vlogger: రష్యా వ్లాగర్ ముంబై సిద్ధివినాయక్ ఆలయంలో పూజలు.
రష్యాకు చెందిన ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ మారియా చుగురోవా తాజాగా భారత్ లో పర్యటించింది. ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు హిందూ సంస్కృతి పట్ల ఆమెకున్న భక్తిశ్రద్ధలను చూసి ముచ్చటపడుతున్నారు. వీడియోకు ఏకంగా 30 లక్షల వ్యూస్ లభించాయి. అలాగే 3.5 లక్షల లైక్ లు వచ్చాయి.

వీడియోలో చూడీదార్ ధరించి, నుదుటన బొట్టు పెట్టుకొని మారియా చుగురోవా కనిపించింది. వినాయకుడికి పూజ చేసేందుకు ఆలయ ఆవరణలో పూజా సామగ్రి, పూల దండ కొనుగోలు చేసింది. అనంతరం దైవదర్శనం చేసుకుంది. ఆలయంలో భక్తుల రద్దీ, తోపులాట ఉన్నప్పటికీ విఘ్నేశ్వరుని దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని వ్యాఖ్యానించింది. ఈ అనుభవానికి ఎంతో గర్విస్తున్నట్లు పేర్కొంది. ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆమెను అక్కడ చూసి ఇన్ స్టా ఫాలోవర్లు గుర్తించి అవాక్కయ్యారు. దీంతో వారితో కలిసి ఆమె సరదాగా ఫొటోలు దిగింది. ఓ మహిళ అయితే ఏకంగా ఆమెకు ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మారియా చెగురోవా దాని కింద సుదీర్ఘ క్యాప్షన్ ను జత చేసింది. నమస్తే దోస్తులారా అంటూ అందులో రాసుకొచ్చింది. వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు స్పందించారు. భారత సంస్కృతిని ఆమె ఎంతో ఆస్వాదిస్తోందని ఓ యూజర్ పేర్కొన్నాడు. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఇండియా అంటూ మరొకరు స్పందించారు. క్యూట్ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.