Tech Companies: గంట పనికి రూ.కోట్ల జీతమా..? టెక్‌ కంపెనీలను వేధిస్తున్న ఫేక్‌ వర్క్‌.. వీడియో.

Tech Companies: గంట పనికి రూ.కోట్ల జీతమా..? టెక్‌ కంపెనీలను వేధిస్తున్న ఫేక్‌ వర్క్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 26, 2023 | 9:13 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ పరిశ్రమలను వేధిస్తోంది ‘ఫేక్‌ వర్క్‌'. కొందరు ఉద్యోగులు కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ.. వేతనాలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్‌ పత్రిక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతను రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్లు అంటే 1.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ పరిశ్రమలను వేధిస్తోంది ‘ఫేక్‌ వర్క్‌’. కొందరు ఉద్యోగులు కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ.. వేతనాలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్‌ పత్రిక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతను రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్లు అంటే 1.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. 20 ఏళ్ల ఓ వ్యక్తి గూగుల్ ఉద్యోగి. అతడు రోజంతా కష్టపడకుండా కేవలం గంట మాత్రమే పని చేస్తానంటూ తెలిపాడు. మేనేజర్‌ ఇచ్చే కోడ్‌ను పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అందుకు అతను కోడ్‌లో కీలకమైన భాగాన్ని ముందుగానే రాసుకుంటానని చెప్పాడు. మిగిలిన పనిని వారం రోజుల్లో నెమ్మదిగా పూర్తి చేస్తానని అన్నాడు. అయితే, ఇందుకోసం రోజంతా కష్టపడకుండా వేగంగా కోడ్‌ను రాస్తానని.. దీని కోసం కేవలం గంట సమయాన్ని కేటాయిస్తానని తెలిపాడు. ‘‘ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసాక గంట పాటు గూగుల్‌ కోసం పని చేస్తానని దీని కోసం రోజంతా కష్టపడనని మిగిలిన సమయాన్ని తన స్టార్టప్‌ కోసం వాడతానని ఇంటర్వ్యూలో అన్నాడు. మిగిలిన కంపెనీలతో పోలిస్తే గూగుల్‌లో పని చేసే వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయన్నది పలువురి అభిప్రాయం. చాలామంది ఇంజినీర్లు ఇలాగే రోజంతా కష్టపడకుండా వేల జీతాలు పొందుతున్నారు. వారిలో తను కూడా ఒకడినే’’ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...