క్యాన్సర్ రోగుల కోసం కదిలిన ఒడిశా కేశదాత హరప్రియ

Updated on: Oct 29, 2025 | 3:53 PM

జుట్టు ప్రతి మనిషికీ ఇష్టమే. ఆడవారైతే తమ పొడవాటి జుట్టును చూసుకుని మురిసిపోతుంటారు. తమ జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. మహిళలకు ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి సోకితే కీమోథెరపీ చేయకతప్పదు. కానీ దీనివల్ల జుట్టును కోల్పోక తప్పదు. జుట్టు రాలడం వల్ల చాలా మంది నిరాశపడతారు. ముఖ్యంగా అందమైన జుట్టు కోల్పోయిన తర్వాత డీలా పడిపోతారు.

బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిపడతారు. అలాంటి వారికి విగ్గుల కోసం ఒడిశాలోని భువనేశ్వర్‌కి చెందిన హరప్రియ నాయక్ తన జుట్టును దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ రోగుల కోసం ఒడిశాలో కురులు దానం చేసిన కేశదాతగా హరప్రియ నిలిచింది. క్యాన్సర్​ రోగులలో ముఖ్యంగా నిరుపేద మహిళల్లో తిరిగి ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు హరప్రియ పనిచేస్తుంది. క్యాన్సర్ రోగుల కోసం జుట్టును సేకరించి, ఆ కురులతో విగ్గులు తయారు చేసే బాధ్యతను కూడా తీసుకుంది. ఆమె స్థాపించిన మిషన్ స్మైల్‌లో భాగస్వాములుగా ఉన్న 150 మంది వాలంటీర్లు తరచూ తమ కేశాలను విరాళంగా ఇస్తారు. సహజ కేశాలతో తయారయ్యే విగ్గులను కొనే స్తోమత లేని నిరుపేద మహిళలకు హరప్రియ విగ్గులను తయారుచేసి అందిస్తుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీధి కుక్కల ఆకలి తీర్చి.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తున్న ఒడిశా వాసి

కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..

నవంబరు 1 నుంచి మారనున్న ఆధార్‌ రూల్స్‌

కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు

ర‌జ‌నీ-క‌మ‌ల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి