Train Passengers: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. రిజర్వేషన్‌ సేవలకు బ్రేక్‌.!

|

Apr 14, 2024 | 5:59 PM

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. మీరు ఢిల్లీ చుట్టు ప్రక్కల రాష్ట్రాలకు ప్రయాణించాలనుకుంటే శుక్రవారం రాత్రిలోపే రిజర్వేషన్‌ చేసుకోండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అందుకే ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసుకోమని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. మీరు ఢిల్లీ చుట్టు ప్రక్కల రాష్ట్రాలకు ప్రయాణించాలనుకుంటే శుక్రవారం రాత్రిలోపే రిజర్వేషన్‌ చేసుకోండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అందుకే ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసుకోమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభావం ప్రయాణికులపై పెద్దగా పడదని, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్‌ఎస్‌ దేశవ్యాప్తంగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఈ ఐదు నగరాల నుండి మాత్రమే పనిచేస్తుంది. ఢిల్లీ PRS వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ PRS ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ, ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ PRSకు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని PRS నుండి చేయలేరని పేర్కొంది. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయమని సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..