Reptile Walking Video: నేలపైనే కాదు నీటిపైనా పరుగెత్తగలను..! వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్స్..

Updated on: Dec 11, 2022 | 10:01 AM

ప్రకృతి ఎన్నో అందాలకు నిలయం. రకరకాల జీవులు.. ఒక్కో జీవి జీవనసరళి ఒక్కో రకంగా ఉంటుంది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో జీవులకు సంబంధించిన వింతలు విశేషాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.


వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొలనులో ఉన్న ఎండిన కొమ్మపైన ఓ తొండ ఉంది. అది అక్కడికి ఎలా చేరిందో కానీ ఇప్పడు అది నేలపైకి రావాలనుకుంది. కానీ కింద చూస్తూ నీళ్లు.. కాసేపు ఆలోచించిన ఆ తొండ ఒక్కసారిగా నీటిలోకి దూకింది. చకచకా నడుచుకుంటూ గట్టుపైకి వెళ్లిపోయింది. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘‘నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు సృష్టించబడే శక్తి ప్రబలంగా ఉంటుంది. అప్పుడు చిన్న జంతువులు నీటి ఉపరితలంపై సునాయాసంగా నడుచుకుంటూ వెళ్లొచ్చు’’అంటూ వీడియోకి క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో పట్ల నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి తన అందాలను ప్రపంచానికి ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుందని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 11, 2022 10:00 AM
Follow Us