Reptile Walking Video: నేలపైనే కాదు నీటిపైనా పరుగెత్తగలను..! వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్స్..
ప్రకృతి ఎన్నో అందాలకు నిలయం. రకరకాల జీవులు.. ఒక్కో జీవి జీవనసరళి ఒక్కో రకంగా ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో జీవులకు సంబంధించిన వింతలు విశేషాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొలనులో ఉన్న ఎండిన కొమ్మపైన ఓ తొండ ఉంది. అది అక్కడికి ఎలా చేరిందో కానీ ఇప్పడు అది నేలపైకి రావాలనుకుంది. కానీ కింద చూస్తూ నీళ్లు.. కాసేపు ఆలోచించిన ఆ తొండ ఒక్కసారిగా నీటిలోకి దూకింది. చకచకా నడుచుకుంటూ గట్టుపైకి వెళ్లిపోయింది. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘‘నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు సృష్టించబడే శక్తి ప్రబలంగా ఉంటుంది. అప్పుడు చిన్న జంతువులు నీటి ఉపరితలంపై సునాయాసంగా నడుచుకుంటూ వెళ్లొచ్చు’’అంటూ వీడియోకి క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పట్ల నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి తన అందాలను ప్రపంచానికి ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుందని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మల్లన్న సన్నిధికి 'సాష్టాంగ' యాత్ర..
ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

