చిమ్మ చీకటి.. జోరువాన.. సెల్ లైట్ వెలుగులో డెలివరీ

Updated on: Sep 06, 2025 | 1:34 PM

అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో అత్యవసర వైద్యం అందాలంటే అవస్థలు పడాల్సిందే. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా, విసిరేసినట్లుండే ఆ గిరిజన గ్రామాల్లో నేటికీ సురక్షితంగా కాన్పు అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు నేటికీ కనీస సదుపాయాలకు నోచుకోలేదు.

తాజాగా ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి 108 సిబ్బంది అడవి మార్గంలో సెల్‌ఫోన్ వెలుగులో కాన్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం లోని కన్నాపురం గ్రామానికి చెందిన రవ్వ దేవమ్మకు సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సిబ్బంది కన్నాపురం బయలుదేరారు. నర్సింగ పేట గ్రామం వరకు వెళ్ళాక అక్కడి నుండి దారి సరిగా లేకపోవడంతో గ్రామానికి 3 కి.మీ.దూరంలోనే అంబులెన్సు నిలిపి దేవమ్మను తీసుకొచ్చేందుకు ఆశా వర్కర్ తో పాటు EMT రామమోహన్ కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. చీకట్లో జోరు వానలో గొడుగు పట్టుకుని దేవమ్మను తీసుకొస్తుండగా మార్గమధ్యలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది సెల్ ఫోన్ లైటు వెలుగులో అడవిలోనే కాన్పు చేశారు. దేవమ్మ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరిపీల్చుకొన్నారు. తల్లీబిడ్డను కోతులగుట్ట వైద్యశాలకు తరలించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితిలో.. ఆశా వర్కర్, EMT చొరవ తీసుకుని మహిళకు డెలివరీ చేయటంతో.. స్థానికులు వారిని అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక

Social Media: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం

గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు

‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!