Hyderabad: హైదరాబాద్ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థానికులు..
రోడ్డు ప్రమాదాలప్పుడు ఎవరైనా తీవ్రంగా గాయపడితే రోడ్డు రక్తసిక్తంగా మారడం మనం చూస్తుంటాం. కానీ అక్కడ హత్యలు... రోడ్డు ప్రమాదాలు ఏవీ జరగలేదు. కానీ రహదారి మొత్తం ఎర్రసముద్రాన్ని తలపించింది. చూసేందుకు రక్తం మాదిరే ఉండటంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు ఆందోళన చెందారు. ఇది ఎక్కడో కాదు.. గ్రేటర్ హైదరాబాద్‌లోనే..
నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రినగర్‌లో సోమవారం సాయంత్రం మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. రెండు రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో నివాసితులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తున్నారని వాపోయారు. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.