ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కేజీల బంగారం కొనుగోలు

Updated on: Nov 09, 2025 | 3:16 PM

బంగారం ధరలు గత కొన్ని నెలల నుంచి చుక్కలనంటుతున్నాయి. దేశంలో బంగారం ధర బాగా పెరిగిపోవడానికి పండుగల సీజన్ కూడా కారణం అని చెప్పవచ్చు. 2025వ సంవత్సరంలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.సెప్టెంబర్ నెల గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. దీని ప్రకారం చూస్తే.. సెంట్రల్ బ్యాంకులు.. ఏకంగా 39 వేల కిలోల బంగారాన్ని కొనుగోలు చేశాయి.

ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కిలోలు… అంటే 39 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో మొత్తం 43 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 4 టన్నుల బంగారాన్ని విక్రయించాయి. ఈ ఏడాది మొత్తంలో చూసుకుంటే ఒక నెలలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇంత అత్యధికంగా ఉండడం ఇదే తొలిసారని డబ్ల్యూజీసీ తెలిపింది. 2025లో ఇప్పటి వరకూ మొత్తం 634 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఎగబడి కొనుగోళ్లు చేశాయి. పెట్టుబడుల డిమాండ్‌ కూడా అధికంగా ఉంది. సెప్టెంబర్ నెలలో ఏ బ్యాంకు ఎంత మొత్తం బంగారం కొనుగోలు చేసిందా అని చూస్తే.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ అత్యధికంగా 15 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజగిస్తాన్ 8 టన్నులు, బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6000 కేజీలు, రష్యా కేంద్ర బ్యాంక్ 3 టన్నులు, టర్కీ 2 టన్నుల చొప్పున పుత్తడిని కొన్నాయి. అటు, వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు కూడా బంగారంపై పెట్టుబడులు భవిష్యత్ లో మంచి ఫలితాల్ని ఇస్తాయని భావిస్తుండటమే దీనికి కారణం. ఇటీవల బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఫెడ్‌ ప్రకటించడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొలిక్కివస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీలకు తరలించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ

ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..

Safety Pin: పిన్నీసు ధర రూ. 69 వేలు ??

బ్రో.. ఈ మేకను తీసుకొని.. ఆలుగ‌డ్డలివ్వు..

నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు