Watch: వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..

|

Oct 15, 2024 | 1:38 PM

అవసాన దశలో తండ్రికి అండగా నిలవాల్సింది పోయి, భిక్షమెత్తుకునేలా చేసాడు ఓ వ్యక్తి. ఆఖరికి ప్రభుత్వం తండ్రికి ఇచ్చిన ఇంటిని కూడా లాగేసుకుని రోడ్డుపాలు చేశాడు. చేసేదిలేక స్థానిక ఆర్డీవోను ఆశ్రయించాడు ఆ తండ్రి. వెంటనే స్పందించిన ఆర్డీవో అతనికి న్యాయం జరిగేలా చేశారు. దాంతో ఆ తండ్రి ఆర్డీవోకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లకు చెందిన అదువాల రాజమల్లుకు అనిల్ కుమార్, సురేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించింది. ఇల్లు రాజమల్లు పేరున ఇవ్వాల్సి ఉండగా అతని పెద్దకొడుకు అనిల్ కుమార్ తన భార్య పేరిట రాయించుకున్నాడు. గత ఆరు నెలల నుంచి రాజమల్లును కొడుకులు పట్టించుకోకపోవడంతో ఆయన రోడ్లపైనే ఉంటూ భిక్షాటన చేసి కడుపునింపుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన తన పరిస్థితిని ఆర్డీవోకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో తంగల్లపల్లి ఎమ్మార్వో కు పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో రమేశ్ ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపిన తంగళ్లపల్లి తహసీల్దార్ రాజమల్లు ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆ నివేదికను ఆర్డీవోకు సమర్పించారు. దీంతో పెద్ద కొడుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును వారం రోజుల్లో ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలని, కొడుకులు ఇద్దరూ ప్రతినెల తండ్రికి రూ.2 వేల చొప్పున చెల్లించాలని ఆర్డీవో ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని రాజమల్లు పేరున మార్చాలని తహసీల్దారు ఆదేశించారు. అనిల్ కుమార్ కు నోటీసులు అందజేశారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన అధికారులకు రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎవరైనా తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో లోలావర్ రమేష్ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 15, 2024 11:59 AM