Rat Modeling: మోడలింగ్‌ అదరగొడుతున్న చిట్టెలుక.. పూలు చేత్తో పట్టుకొని ఫోటోలకు ఫోజులు..

|

Jul 30, 2022 | 5:47 PM

సాధార‌ణంగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఫొటోల‌కు ఫోజులిస్తుంటాయి. అయితే వీటికి పోటీగా ఓ ఎలుక కూడా ఫోటోలకు ఫోజులిస్తోంది. ఏదో యాడ్‌కు మోడలింగ్‌ చేస్తున్నట్టుగా పూలు


సాధార‌ణంగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఫొటోల‌కు ఫోజులిస్తుంటాయి. అయితే వీటికి పోటీగా ఓ ఎలుక కూడా ఫోటోలకు ఫోజులిస్తోంది. ఏదో యాడ్‌కు మోడలింగ్‌ చేస్తున్నట్టుగా పూలు చేత్తో పట్టుకొని రకరకాల ఫోజులిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జూలియన్‌ రాడ్‌ అనే వైల్డ్‌ ఫోటోగ్రాఫర్‌ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఒక ఎలుక కన్నం దగ్గరకు వెళ్లి తన కెమెరాకు పని చెప్పారు. విచిత్రంగా ఆ కన్నంలోంచి ఓ అడ‌వి చిట్టెలుక బయటికి వచ్చింది. దానికి కొన్ని పూలు అందించాడు జూలియన్‌. ఇక ఆ ఎలుక పూలు ప‌ట్టుకొని హొయ‌లుపోతూ.. ఓ చిట్టి మోడ‌ల్ అయిపోయింది. ఈ చిట్టెలుక మోడ‌లింగ్ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘మీరెప్పుడైనా అడివి చిట్టెలుక ఫొటోషూట్ చేయ‌డం చూశారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో బొరియ‌లోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ అడ‌వి చిట్టెలుక‌కు ఫొటోగ్రాఫ‌ర్ కొన్ని పూలు అందించాడు. అది వాటిని ప‌ట్టుకొని చకచకా తింటూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ వీడియోను మిలియ‌న్ల సంఖ్యలో వీక్షిస్తున్నారు. లక్షలమంది లైక్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 30, 2022 05:47 PM