Rat Modeling: మోడలింగ్ అదరగొడుతున్న చిట్టెలుక.. పూలు చేత్తో పట్టుకొని ఫోటోలకు ఫోజులు..
సాధారణంగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఫొటోలకు ఫోజులిస్తుంటాయి. అయితే వీటికి పోటీగా ఓ ఎలుక కూడా ఫోటోలకు ఫోజులిస్తోంది. ఏదో యాడ్‌కు మోడలింగ్ చేస్తున్నట్టుగా పూలు
సాధారణంగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఫొటోలకు ఫోజులిస్తుంటాయి. అయితే వీటికి పోటీగా ఓ ఎలుక కూడా ఫోటోలకు ఫోజులిస్తోంది. ఏదో యాడ్‌కు మోడలింగ్ చేస్తున్నట్టుగా పూలు చేత్తో పట్టుకొని రకరకాల ఫోజులిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో జూలియన్ రాడ్ అనే వైల్డ్ ఫోటోగ్రాఫర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఒక ఎలుక కన్నం దగ్గరకు వెళ్లి తన కెమెరాకు పని చెప్పారు. విచిత్రంగా ఆ కన్నంలోంచి ఓ అడవి చిట్టెలుక బయటికి వచ్చింది. దానికి కొన్ని పూలు అందించాడు జూలియన్. ఇక ఆ ఎలుక పూలు పట్టుకొని హొయలుపోతూ.. ఓ చిట్టి మోడల్ అయిపోయింది. ఈ చిట్టెలుక మోడలింగ్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మీరెప్పుడైనా అడివి చిట్టెలుక ఫొటోషూట్ చేయడం చూశారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో బొరియలోనుంచి బయటకు వచ్చిన ఓ అడవి చిట్టెలుకకు ఫొటోగ్రాఫర్ కొన్ని పూలు అందించాడు. అది వాటిని పట్టుకొని చకచకా తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియోను మిలియన్ల సంఖ్యలో వీక్షిస్తున్నారు. లక్షలమంది లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

