గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

Updated on: Apr 09, 2025 | 7:09 PM

ఎలుక రికార్డు క్రియేట్ చేయడమేంటి అనుకుంటున్నారా…అవును అపోపో అనే స్వచ్ఛంద సంస్ధకు చెందిన రోనిన్ ‌ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ మందుపాతరలను కనిపెట్టడంలో సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఎలుక ఇప్పటి వరకు దాదాపు 100కుపైగా మందుపాతరలు, ప్రమాదకరమైన యుద్ధ అవశేషాలను కనిపెట్టింది. అపోపో అనేది స్వచ్ఛంద సంస్థ. ఇది టాంజానియా కేంద్రంగా పనిచేస్తుంది.

ఈ సంస్థ మందుపాతరలను కనిపెట్టడంలో ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. ఈ సంస్థ దగ్గర 104 ఎలుకలు ఉన్నాయి. యుద్ధభూమిలో వదిలేసిన మందుపాతరలు, ఇతర ఆయుధాల్లో లభించే రసాయనాలను పసిగట్టేలా ఈ ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. ఎలుకలకే ఎందుకు అంటే… ఇవి సైజులో చిన్నగా ఉండటమే కాకుండా.. వాసనను త్వరగా పసిగట్టగలవు. ఆకారంలో చిన్నగా ఉండటం వలన అవి అడుగు పెట్టినా వాటి బరువుకి మందుపాతరలు పేలవు. అందుకే వీటి ద్వారా పేలుడు పదార్థాలను సెర్చ్ చేయడం సులభం అవుతుంది. పైగా ప్రమాదాలను నివారించవచ్చు. దీంతో ఈజీగా మందుపాతరలను కనిపెట్టవచ్చుని అపోపో సంస్థ చెబుతోంది. ఇదే కాదు ఈ ఎలుకలు క్షయ వ్యాధిని కూడా గుర్తించగలవట.ఈ ఎలుకల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇవి మనుషుల కన్నా చాలా వేగంగా పని చేస్తాయట. ఒక మనిషి నాలుగు రోజుల్లో మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసే ప్రాంతాన్ని.. ఈ ఎలుకలు కేవలం అరగంటలోనే తనిఖీ చేయగలవని అపోపో సంస్థ వారు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం 

ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?

తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్‌ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో

పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో

బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపైకి వస్తే.. వీడియో