అరుదైన ఈ పువ్వును మీరు ఎప్పుడూ చూసి ఉండరు!
దుంప మొక్కలకు పువ్వులు పూయడం చాలా అరుదు. అయితే, ఏలూరు జిల్లా ఉండ్రాజవరంలో కంద మొక్క అద్భుతంగా పూసింది. కంద దుంపను 2-3 సంవత్సరాలు భూమిలో వదిలేస్తే ఇలా పువ్వు వస్తుందని ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ అరుదైన కంద పువ్వును చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు, ఇది సాధారణంగా జరిగే విషయం కాదు.
సాధారణంగా దుంప మొక్కలకు పువ్వులు రావడం అరుదు. ఆకులే వస్తాయి. కంద, క్యారెట్, బీట్‌రూట్,ముల్లంగి ఇలా ఏ మొక్కలు చూసినా ఆకులే కనిపిస్తాయి. దుంప భూమిలో పెరుగుతుంది. దుంప బాగా పెరిగిందని భావించినప్పుడు రైతులు వాటిని భూమినుంచి వాటిని తవ్వి తీస్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడూ చూడని ఓ పువ్వుని చూడబోతున్నారు. అవును కంద పువ్వు. ఇదేంటి..కంద పువ్వు.. ఇప్పుడే కదా దుంప మొక్కలు పువ్వులు పూయవు అని చెప్పారు… అనుకుంటున్నారా.. అదే కదా విచిత్రమంటే.. అప్పుడప్పుడూ ఈ దుంప మొక్కలు కూడా పువ్వులు పూస్తాయి. అయితే చాలా అరుదుగా ఇది జరుగుతుంది. తాజాగా ఏలూరు జిల్లా ఉండ్రాజవరంలో ఈ కంద పువ్వు పూసి అందరినీ ఆకట్టుకుంటోంది. ఏలూరు : ఏలూరు జిల్లా ఉండ్రాజవరం మండలం లోని తాడిపర్రుకు చెందిన రైతు మట్టా చంటి పొలంలో ఈ కంద పువ్వు పూసింది. సాధార ణంగా కంద దుంప నుంచి మొక్క భూమి పైకి పెరుగుతుంది. ఇక్కడ మాత్రం అందమైన పువ్వు రావటంతో అందరూ ఈ పువ్వును ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీనిపై ఉద్యాన అధికారిణి యాళ్ల దీప్తి మాట్లాడుతూ పంట వేసిన ఏడాదికి కంద దుంప తయారవుతుంది. ఆ దుంపను భూమి నుంచి తవ్వకుండా అలాగే రెండు, మూడేళ్లవరకూ వదిలేస్తే ఇలా పువ్వు వస్తుందని వివరించారు. ఐతే రైతులు కందను భూమిలో నాటిన తరువాత పరిమిత సమయంలో తవ్వి దుంపలను మార్కెట్ కి తరలిస్తారు. ఎప్పుడైనా ఇలా ఏళ్ల తరబడి భూమిలో కంద దుంపు ఉండిపోతే.. ఇలా పుష్పించి అందరినీ ఆకర్షిస్తుంది. ఈ కంద పువ్వును చూసేందుకు స్థానికులు చంటి పొలానికి క్యూ కడుతున్నారు. కంద మొక్కకు పూసే పువ్వు సాధారణంగా వింత ఆకారంలో ఉంటుంది. కొన్నిసార్లు ఈ పువ్వు వినాయకుడి ఆకారంలో పూస్తుంది అనే వార్తలు కూడా ఉన్నాయి. కంద మొక్కను కొన్ని పూజలలో కూడా ప్రత్యేకంగా పూజిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాష్‌రూమ్‌లో నుంచి భారీ శబ్ధం.. వెళ్లి చూస్తే..అమ్మబాబోయ్..
ట్రూ-కాలర్ కాదు.. అంతకు మించి.. ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే
వీరికి సీతాఫలం విషంతో సమానం.. హెచ్చరిస్తున్న వైద్యులు
డెడ్‌బాడీకి అంత్యక్రియలు.. అనుమానంతో చెక్‌చేసిన కాటికాపరి షాక్
గోవా ట్రిప్ పేరుతో క్యాసినోల్లో జూదం.. ఆస్తులు కుదువపెట్టి అప్పులపాలవుతున్న యువత