ఆ స్టేషన్‌లో ఎయిర్‌పోర్టును మించిన లగ్జరీలు
భోపాల్‌లోని రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ దేశంలోనే మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్. ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా లగ్జరీ సౌకర్యాలు, ఏసీ లాంజ్‌లు, హై-స్పీడ్ ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు ఇక్కడ ఉన్నాయి. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ స్టేషన్ ప్రయాణికులకు విదేశీ ఎయిర్‌పోర్ట్ అనుభూతిని అందిస్తుంది. దీని విశేషాలను ఈ కథనంలో తెలుసుకోండి.
మన దేశంలో ఓ రైల్వేస్టేషన్లో ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సౌకర్యాలున్నాయి. 2021 నుంచి అది రైలు ప్రయాణికులకు లగ్జరీ ఫీల్‌ని ఇస్తోంది. ఏసీ లాంజ్‌లు, హై స్పీడ్ ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ అవుట్‌లెట్లు, కన్వెన్షన్ సెంటర్ ఈ రైల్వే స్టేషన్‌లో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది. దాని విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశంలో అన్ని స్టేషన్లను ప్రభుత్వమే నిర్వహించడం చూసాం. అయితే భోపాల్‌లోని రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ దేశంలోనే మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ లో … రైలు ప్రయాణికులకు అందించే సౌకర్యాలు విదేశీ ఎయిర్‌పోర్టుల్లో అందించే లగ్జరీ సౌకర్యాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి. గోండ్ రాణి గౌరవార్థం ఈ స్టేషన్‌కు రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. ఈ స్టేషన్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం తో పనిచేస్తుంది. స్టేషన్‌కు యజమాని భారతీయ రైల్వే అయినప్పటికీ.. స్టేషన్ నిర్వహణ, రోజువారీ కలాపాలను మాత్రం బన్సల్ గ్రూప్ అనే ఒక ప్రైవేటు కంపెనీ చూసుకుంటుంది. సోలార్ ఎనర్జీతో నడిచే సదుపాయాలు, 24 గంటల విద్యుత్ , సీసీటీవీ సెక్యూరిటీ రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌లో ఉన్నాయి. న్యూఢిల్లీ–చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్.. భోపాల్ రైల్వే డివిజన్‌కు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఈ రైల్వే స్టేషన్‌లో హాల్ట్ అవుతాయి. రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ లోపలికి అడుగు పెట్టగానే ఎయిర్‌పోర్ట్ తరహా సౌకర్యాలు స్వాగతం పలుకుతాయి. ప్రయాణికుల విశ్రాంతి కోసం విశాలమైన, ఎయిర్ కండిషన్డ్ కన్‌కోర్స్‌లు.. వెయిటింగ్ లాంజ్‌లు ఉంటాయి. ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సులభంగా రాకపోకలు సాగించడానికి హై స్పీడ్ ఎస్కలేటర్లు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు, రిటైల్ అవుట్‌లెట్లు, ఒక హోటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆఫీస్ స్పేస్ కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ సూపర్ మార్కెట్‌లో అన్నీ ఫ్రీనే
రూ. 8 లక్షల కారులో వచ్చి.. రూ. 8 పేపర్‌ను దొంగిలించాడు
చలికాలంలో పెదవులు పలిగిపోతున్నాయా ?? ఇది మీకోసమే
