సొంత కూతురిని కిడ్నాప్‌ చేసిన తండ్రి.. వీడియో వైరల్‌

Edited By: Phani CH

Updated on: Oct 13, 2025 | 7:03 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను సొంత తండ్రి కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. తన మీద అలిగి.. పుట్టింటికి చేరిన భార్య మీద కోపంతో.. అత్తగారింటి వద్ద మాటేసిన అల్లుడు.. బయట ఆడుకుంటున్న కూతురుని అపహరించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌లోని ఝుంఝును నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన హేమంత్ సోని, ఆకాంక్ష దంపతులకు 2022 నవంబర్‌లో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కుమార్తె వంశిక ఉంది. అయితే దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో ఆకాంక్ష కుమార్తెను తీసుకుని జుంజునులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత కొంతకాలంగా ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న వంశిక కనబడకుండా పోయింది. అప్పటి వరకు కూతురిని ఆడించి ఇంట్లోకి వెళ్లి వచ్చేటప్పటికి కూతురు అదృశ్యమైంది. దీంతో ఆందోళన చెందిన ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆకాంక్ష భర్త హేమంత్ కుమార్తెను ఎత్తుకుని పరుగెత్తడం వీడియోలో కనిపించింది. దీంతో ఆకాంక్ష స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భర్త హేమంత్ సోనీపై కిడ్నాప్‌ కేసు పెట్టింది. కుమార్తెను తీసుకెళ్తానంటూ హేమంత్‌ గత కొంత కాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆకాంక్ష పోలీసులకు తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ వైభవం.. చూసి తీరాల్సిందే!

5.8 కిలోల బరువుతో శిశువు జననం.. వైరల్‌గా వీడియో

తులం బంగారం రూ.3 లక్షలు కానుందా

అమెరికాలో విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఆదాయం పైనా పన్ను

పాడుబడ్డ భవనంపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. లోపలి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ??

Published on: Oct 13, 2025 07:03 PM