Rainbow Tree: బ్యూటీఫుల్‌ కలర్స్‌తో మెరిసే అందమైన రెయిన్‌బో యూకలిప్టస్ చెట్లు.. చుస్తే మతిపోవాల్సిందే..!

|

Apr 02, 2022 | 9:24 AM

మన చుట్టూ ఉండే... ప్రకృతి ఎంతో అందమైనది. ఇందులో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు, మరెన్నో సహజ అద్భుతాలు దాగున్నాయి. అందులో ఒకటి రెయిన్ బో యూకలిఫ్టస్ చెట్లు. ఇవి ఎవరో పెయింట్ చల్లినట్టుగా.. ఇంద్రధనుస్సు రంగులతో మెరిసిపోతుంటాయి.

YouTube video player
మన చుట్టూ ఉండే… ప్రకృతి ఎంతో అందమైనది. ఇందులో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు, మరెన్నో సహజ అద్భుతాలు దాగున్నాయి. అందులో ఒకటి రెయిన్ బో యూకలిఫ్టస్ చెట్లు. ఇవి ఎవరో పెయింట్ చల్లినట్టుగా.. ఇంద్రధనుస్సు రంగులతో మెరిసిపోతుంటాయి. ఇటీవల IFS అధికారి సుశాంత్ నందా ఈ రెయిన్‌బో యూకలిప్టస్ చెట్లకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో ఇప్పుడవి నెట్టింట తెగ సందడి చేస్తు్న్నాయి.ఈ చెట్టు ఇంద్రధనస్సు రంగులకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత రంగురంగుల చెట్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. దీనిని సైన్స్ భాషలో యూకలిప్టస్ డెగ్లుప్టా అంటారు. దీనిని రెయిన్‌బో గమ్ అని కూడా అంటారు. ఈ ప్రత్యేక రంగు చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తాయి. వర్షారణ్యాలలో కనిపించే యూకలిప్టస్ జాతి ఇది ఒక్కటే. రెయిన్ బో యూకలిఫ్టస్ చెట్టు వయస్సు పెరిగేకొద్దీ దాని రంగు మారుతుంది. రంగురంగుల రూపానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ చెట్టు పెరిగి పెద్దదవుతున్న కొద్దీ దాని బెరడు తొలగిపోతుంది. బెరడు తొలగించబడిన తర్వాత కొత్తగా, ప్రకాశవంతమైన రంగులు కనిపించడం ప్రారంభమవుతుంది. చెట్టు మొత్తం మీద రంగు ప్రభావం కనిపించడానికి ఇదే కారణం. ఇకపోతే, రెయిన్‌బో యూకలిప్టస్ సగటు పొడవు 76 మీటర్లు. తక్కువ సంఖ్యలో ఈ చెట్టు హవాయి, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలో కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాని పొడవు 30 నుండి 38 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రకృతి కళ అని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..