పోలీసన్నా.. నీ ఐడియా సూపర్.. మాటల్లో పెట్టి ప్రాణం కాపాడావ్..
ఏదైనా ప్రమాదాలు, ఆపదలు ఎదురైనప్పుడు సాధారణంగా చాలామంది కంగారు పడిపోతారు. ఎలా... ఎలా.. అని నానా హైరానా పడిపోయి గోల గోల చేస్తారు. అలాంటప్పుడే సమయస్పూర్తితో వ్యవహరించాలి. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం తోస్తుంది. ప్రమాదంనుంచి బయటపడేస్తుంది.
ఏదైనా ప్రమాదాలు, ఆపదలు ఎదురైనప్పుడు సాధారణంగా చాలామంది కంగారు పడిపోతారు. ఎలా… ఎలా.. అని నానా హైరానా పడిపోయి గోల గోల చేస్తారు. అలాంటప్పుడే సమయస్పూర్తితో వ్యవహరించాలి. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం తోస్తుంది. ప్రమాదంనుంచి బయటపడేస్తుంది. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. ఓ పోలీస్ సమయస్పూర్తితో వ్యవహరించి ఓ వ్యక్తికి పునర్జన్మనిచ్చారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఫైఓవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోడానికి యత్నించాడు. అక్కడికి సమీపంలోనే విధులు నిర్వహిస్తున్న సతీష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇంకా మరో వ్యక్తి అతన్ని గమనించారు. కానిస్టేబుల్ సతీష్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. సతీష్ ఇక్కడ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఎక్కడా అనుమానం రాకుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ అసలు వ్యక్తిని పట్టించుకోనట్టే వ్యవహరించారు. అలా ఆ వ్యక్తి సమీపానికి వెళ్ళగానే ఒక్కసారిగా అతని మెడలో ఉన్న తువ్వాలును గట్టిగా పట్టుకుని కిందకు లాగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిచ్ గా కార్ లో వచ్చాడు.. వాకింగ్ చేస్తున్న మహిళను ??
Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు
Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!
Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!
బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్