Loading video

గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..

|

Jan 15, 2025 | 3:01 PM

మార్కెట్లో మనం ఏది కొనాలన్నా డిజిటల్ చెల్లింపులు తప్పనిసరిగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. పాల బిల్ల నుంచి కిరాణా, కరెంట్, పాన్ షాప్ ఇలా ఉప్పుకి పప్పుకి ఇలా ఎక్కడైనా సరే స్మార్ట్ ఫోన్ లో యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిపోయాం. ప్రస్తుత పరిస్థితుల్లో యాచకులకు సైతం ఇవ్వాలన్న జేబులో చిల్లర ఉండని పరిస్థితి.

ఈ పరిస్థితి కేవలం పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పల్లెల్లో పండుగలకు ఇళ్ళిళ్ళు తిరిగే హరిదాసులు అప్‌డేట్ అయ్యారు. చిల్లర లేకపోతే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేందుకు వీలుగా UPI స్కానర్‌లు వెంట తెచ్చుకుంటున్నారు. ఏలూరు జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో సిబ్బంది సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంబరాలలో భాగంగా విచిత్ర వేషధారణలు, రంగురంగుల రంగవల్లులు, సంబరాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా గంగిరెద్దు ఆటలను ఏర్పాటు చేశారు. అయితే ఆ గంగిరెద్దు యజమాని దాని కొమ్ములకు యూపీఐ స్కానర్ ఏర్పాటు చేశాడు. దాంతో ఆ డుడు బసవన్న ప్రదర్శన చూసి ఆనందించిన సిబ్బంది దానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఆ యూపీఐ స్కానర్ ద్వారా నగదు బదిలీ చేశారు. వారు స్కానర్ ద్వారా డబ్బులు ఇస్తున్నారని ఇది తమకు సంతోషంగా ఉందని ఆ ఎద్దు యజమాని చెబుతున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..

అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే

గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు కొట్టాడు.. కానీ..

TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం