వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
విశాఖకు చెందిన ఒక కుటుంబం ఊరెళ్ళింది. మూడు రోజుల పాటు క్యాంపు కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చింది. ఇంట్లోకి వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యింది. కొద్దిసేపటికి ఇంటి ఇల్లాలు వాష్ రూమ్‌కు వెళ్దామని సిద్ధమై బాత్రూం తలుపు తీసింది. అంతే.. ఒక్కసారిగా వణికిపోయి.. పరుగు తీసింది. ఆమె పరిగెడుతూ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులంతా వచ్చి చూశారు. విశాఖ మల్కాపురం జయేంద్ర కాలనీలో శాంతి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో సహా విహారయాత్రకు వెళ్లింది.
ఇంటికి తాళాలు వేసుకుని బయలుదేరారు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి.. సామాన్లన్నీ సర్దుకున్నారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కునేందుకు వాష్ రూమ్ వైపు వెళ్లారు. తలుపు తీయగానే.. అక్కడ ఏదో ఉన్నట్టు గుర్తించారు. చీకటిలో తాడులా కనిపించినా.. కాస్త కళ్ళు తుడుచుకుని చూసే సరికి భారీ కొండచిలువ కనిపించింది. బాత్రూమ్‌లో తిష్ట వేసుకు కూర్చున్న పైథాన్ శబ్దాలు చేస్తోంది. దీంతో ఆ భారీ కొండ చిలువను చూసి కేకలు పెడుతూ అందరూ పరుగు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు చేరుకున్న నాగరాజు అండ్ టీం.. భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుంది. 9 అడుగుల కొండచిలువను చూసి, స్థానికుల గుండె ఆగేంత పని అయింది. ఆ కొండచిలువను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఆ గుళ్లో అడుగుపెడితే.. మీ పెళ్లి అయినట్లే వీడియో
ఈ రోడ్డు నుంచి సంగీతం వస్తుంది.. ఆ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే వీడియో