Python – 2 dogs: ఒకేసారి రెండు పెంపుడు కుక్కలను మింగుతున్న కొండచిలువ… ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

|

Jul 20, 2022 | 6:47 PM

మాములుగా పెట్ డాగ్స్ ఎప్పుడూ యజమానిని అంటి పెట్టుకునే ఉంటాయి. ఒకవేళ యజమాని ఇంట్లో లేకపోతే అతను వచ్చేవరకు అలా ఎదురుచూస్తేనే ఉంటాయి.

గ్రామంలో 2 పెంపుడు కుక్కలు మిస్సింగ్.. ఎంత వెతికినా దొరకలేదు.. కట్ చేస్తే.. @TV9 Telugu Digital
మాములుగా పెట్ డాగ్స్ ఎప్పుడూ యజమానిని అంటి పెట్టుకునే ఉంటాయి. ఒకవేళ యజమాని ఇంట్లో లేకపోతే అతను వచ్చేవరకు అలా ఎదురుచూస్తేనే ఉంటాయి. అలాంటిది ఓ వ్యక్తికి చెందిన 2 పెంపుడు కుక్కలు అదృశ్యం అయ్యాయి. ఎంత వెతికినా వాటి ఆచూకి కనిపించలేదు. దీంతో ఆ ఓనర్ ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే ఓవ్యక్తికి అదే గ్రామంలోని ఓ మరుగు ప్రాంతంలో పాత కాంక్రీట్ స్తంభాలపై పాకుతూ భారీ కొండచిలువ కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అందరూ వచ్చి చెక్ చేయగా.. ఆ పైథాన్ అస్సలు కదల్లేకపోతుంది. పొట్ట భారీగా ఉబ్బి ఉంది. అప్పుడు అర్థం అయ్యింది.. ఆ కొండచిలువ పెట్ డాగ్స్‌ను ఆహారంగా తీసుకుందని. దీంతో ఆ ఓనర్ తల్లిడిల్లిపోయాడు. ఈ ఘటన ఈశాన్య థాయ్‌లాండ్‌లోని సిసాకేట్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఇది ఇప్పటివరకు తాము చూసిన పాములలో అతి పెద్దదని ఒక స్థానికుడు తెలిపాడు. కొండచిలువ ఆ బంజరు భూమిలో మాటు వేసి.. కొంతకాలంగా గ్రామంలోని జంతువులను మింగేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో యానిమల్ రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని.. దాన్ని బంధించి పునరావాస కేంద్రానికి తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 20, 2022 06:47 PM