Puppy Viral: దమ్ముంటే బయటకు రారా..! అద్దంలోని ప్రతిబింబంతో కుక్క పిల్ల గొడవ..
పెంపుడు జంతువులు చిన్నగా ఉన్నప్పుడు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. ఎలాంటి వారినైనా ఆకర్షించి, తమ మాయలో పడేస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
పెంపుడు జంతువులు చిన్నగా ఉన్నప్పుడు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. ఎలాంటి వారినైనా ఆకర్షించి, తమ మాయలో పడేస్తాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుక్క పిల్ల చేసిన పనికి పెట్ లవర్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంతగా ఆ కుక్క పిల్ల ఏం చేసింది అనకుంటున్నారా..? ఎంతో ముద్దుగా తనతో తానే గొడవ పడుతోంది. అదెలా అంటారా… ఇదిగో ఇలా.. ఆ కుక్కపిల్ల ఒక జిమ్‌లో ఉంది. అక్కడ జిమ్‌కి సంబంధించిన పరికరాలు ఉన్నాయి. అక్కడే ఓ పెద్ద అద్దం కూడా ఉంది. అక్కడికి వచ్చిన ఓ అందమైన కుక్కపిల్ల అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి వేరే కుక్క అనుకొని దానిపైకి ఫైట్‌కి వెళ్తుంది. అది ఎలా ఎటాక్ చేస్తే అద్దంలోని ప్రతిబింబం కూడా అలాగే రియాక్ట్ అవుతోంది. ఈ ఫైట్‌లో ఆ కుక్కపిల్ల ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్యూట్ వీడియోను కోటి 70 లక్షలమంది వీక్షించారు. 2 లక్షల 30 వేలమందికి పైగా లైక్ చేశారు. కుక్కపిల్ల చిలిపి అల్లరిపై తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. దమ్ముంటే బయటకురా.. చూసుకుందాం.. అని ఒకరు అభిప్రాయపడితే.. ‘నాకు నేనే పోటీ’ అని ఆ కుక్క పిల్ల అనుకుంటుందని ఓ యూజర్ కామెంట్ చేసారు. ‘వెనక్కు వెళ్లిపో.. ముందుకు వస్తే కొడతా..’ అని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!