మళ్లీ దొరికిన పులస !! ఈసారి కిలో ఎంత ధర పలికిందో తెలుసా ??

Updated on: Oct 18, 2022 | 9:02 PM

గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప పులస. నదికి ఎదురీదుతూ వచ్చే ఈ పులస చేప రుచే వేరు. అత్యంత అరుదుగా లభించే ఈ పులస ఈ పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది.

గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప పులస. నదికి ఎదురీదుతూ వచ్చే ఈ పులస చేప రుచే వేరు. అత్యంత అరుదుగా లభించే ఈ పులస ఈ పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస క్రేజే వేరు.. దీనిని దక్కించుకునేందుకు పోటీపడతారు పులసప్రియులు. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస తినాలంటారు పెద్దలు. అనడమే కాదు, ఎంత రేటైనా పెట్టి కొని తింటారు. అందుకే.. పులస ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు తిరగరాస్తూ ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేదారి లంక‌ గోదావరిలో లైవ్ పులస దొరికింది. మాములుగా పులస వలలో పడగానే పదినిమిషాల్లో చనిపోతుంది. కానీ ఈసారి జాలరి చందాడి సత్యనారాయణ వలలో పడ్డ పులస లైవ్ గా దొరికింది. దీంతో తన పంట పండిందనుకున్నాడు ఆ మత్స్యకారుడు. లైవ్ లో దొరికిన సుమారు కేజీ ఉన్న గోదావరి పులసను మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన నల్లి రాంప్రసాద్ అనే వ్యక్తి కిలో బరువున్న ఈ చేపను ఏకంగా 17 వేల రూపాయలు పెట్టి కొన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ మహిళ గుట్టు రట్టు చేసిన యాపిల్‌ వాచ్‌ !! ఏం జరిగిందంటే ??

Digital News Round Up: పుష్ప 2 షూట్‌ బిగిన్స్‌ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్‌ చరణ్‌ గూస్‌బంప్‌ కామెంట్స్..

 

Published on: Oct 18, 2022 09:02 PM