వేలానికి ప్రిన్సెస్‌ డయానా స్వెట్టర్‌.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ??

వేలానికి ప్రిన్సెస్‌ డయానా స్వెట్టర్‌.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ??

Phani CH

|

Updated on: Sep 16, 2023 | 2:00 PM

బ్రిటన్ దివంగత యువరాణి డయానా ధరించిన ఓ స్వెట్టర్‌ను వేలానికి పెట్టారు. ఏకంగా 1.1 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో 9 కోట్లకు పైనే. తెల్ల గొర్రెల మధ్య నల్ల గొర్రె చిత్రాలు ఉన్న ఈ రెడ్ కలర్ స్వెటర్‌ను..సోథెబీస్ చాలా తక్కువ ధరకు అమ్ముడుపోతుందని అంచనా వేసింది. ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన చారిత్రాత్మక బ్లాక్ షీప్ వార్మ్ & వండర్‌ఫుల్ స్వెటర్ ఫ్యాషన్ ఐకాన్ వేలంలో 1.1 మిలియన్‌ డాలర్లకు అమ్ముడయినట్టు వేలం హౌస్ గురువారం ఒక ట్వీట్‌లో తెలిపింది.

బ్రిటన్ దివంగత యువరాణి డయానా ధరించిన ఓ స్వెట్టర్‌ను వేలానికి పెట్టారు. ఏకంగా 1.1 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో 9 కోట్లకు పైనే. తెల్ల గొర్రెల మధ్య నల్ల గొర్రె చిత్రాలు ఉన్న ఈ రెడ్ కలర్ స్వెటర్‌ను..సోథెబీస్ చాలా తక్కువ ధరకు అమ్ముడుపోతుందని అంచనా వేసింది. ప్రిన్సెస్ డయానాకు సంబంధించిన చారిత్రాత్మక బ్లాక్ షీప్ వార్మ్ & వండర్‌ఫుల్ స్వెటర్ ఫ్యాషన్ ఐకాన్ వేలంలో 1.1 మిలియన్‌ డాలర్లకు అమ్ముడయినట్టు వేలం హౌస్ గురువారం ఒక ట్వీట్‌లో తెలిపింది. 1981లో ప్రిన్స్ చార్లెస్ పోలో మ్యాచ్‌కి డయానా ఈ స్వెటర్‌ను ధరించింది. ఆగస్ట్ 31న బిడ్డింగ్ ప్రారంభం కాగా, వేలం చివరి నిమిషం వరకు 2 లక్షల డాలర్ల కంటే తక్కువ ధర పలికింది. సోథెబీస్ ఈ స్వెటర్ విలువ కేవలం 50 నుంచి 80,000 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేసారు. కానీ వారు అనుకున్నదానికంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. స్వెటర్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. నివేదికల ప్రకారం, యువరాణి డయానాకు సంబంధించి స్వెటర్ తోపాటు మరిన్ని ఇతర వస్తువులు వేలంలో ఉంచారు. అయితే ఈ స్వెటర్ మాత్రమే అత్యంత ఖరీదైనదిగా అమ్ముడుపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??

Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??

DSP: మ్యూజిక్‌ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్

Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్‌.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్