Viral: అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..

|

May 28, 2024 | 5:13 PM

రాజన్న ‌సిరిసిల్ల జిల్లా వేములవాడ లో జ్యోతిషం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో ఉడాయించాడు. గత కొంతకాలంగా వేములవాడ లోని అంభాబాయ్ అలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అలయంలో పూజలతో పాటుగా ,జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు. మహేష్ వద్ద కి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో తన మోసపూరిత ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెట్టాడు.

తెలంగాణాలో జ్యోతిషం చెప్పే ఓ పూజారి అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రెండు కోట్ల రూపాయిలు వసూలు చేసి‌ ఉడాయించాడు..తన దగ్గరికి వచ్చే అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి మోసం చేసాడు.. రాజన్న ‌సిరిసిల్ల జిల్లా వేములవాడ లో జ్యోతిషం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో ఉడాయించాడు. గత కొంతకాలంగా వేములవాడ లోని అంభాబాయ్ అలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అలయంలో పూజలతో పాటుగా ,జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు. మహేష్ వద్ద కి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో తన మోసపూరిత ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెట్టాడు.

తన వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి డిపాజిట్లు సేకరించాడు. కొంత మందికి కొద్ది రోజుల వరకు అధిక వడ్డీ ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు. అధిక వడ్డీ ఇస్తుండటంతో చాలా మంది మహేష్ ను నమ్మి డబ్బులు ఇచ్చారు. డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్ళీ డిపాజిట్ల ఆశ చూపడం తో నగరం లోని చాలామంది రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసారు. రెండు కోట్లు వసూలు అయ్యాక పెట్టాబేడా సర్దుకొని తాజాగా మహేష్ ఉడాయించాడు. కొద్ది రోజులుగా‌ జ్యోతిష్యాలయం మూసి ఉండడంతో పాటు ఫోన్ స్విఛ్చాప్ రావడంతో బాధితులు లబోదిబో మంటున్నారు..వేములవాడ లోని వ్యాపారులు, భక్తులు పోలిసులను కలిసి తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.