Presvu Eye Drop: ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’ ఐ డ్రాప్స్‌..

|

Sep 07, 2024 | 12:12 PM

నలభై ఏళ్లు దాటగానే కొందరికి చత్వారం వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది. దాన్నే ప్రెస్‌బయోపియా అంటారు. చత్వారం ఉన్న వారికి కళ్లజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. ముంబైకి చెందిన ఎన్‌టోడ్‌ ఫార్మా కంపెనీ ‘ప్రెస్‌వూ’ పేరిట అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చింది.

నలభై ఏళ్లు దాటగానే కొందరికి చత్వారం వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది. దాన్నే ప్రెస్‌బయోపియా అంటారు. చత్వారం ఉన్న వారికి కళ్లజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. ముంబైకి చెందిన ఎన్‌టోడ్‌ ఫార్మా కంపెనీ ‘ప్రెస్‌వూ’ పేరిట అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చింది. అక్టోబరు మొదటివారంలో ఈ మందును మార్కెట్లోకి తెస్తామని సంస్థ తెలిపింది. 40 నుంచి 55 ఏళ్ల వయసువారిలో.. కొద్దిపాటి నుంచి ఒక మోస్తరు చత్వారంతో బాధపడుతున్నవారు ఈ మందును కంట్లో ఒక్క చుక్క వేస్తే 15 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని సంస్థ సీఈవో నిఖిల్‌ తెలిపారు. ఒక్క చుక్క వేస్తే ఆరు గంటల దాకా.. రెండు చుక్కలు వేస్తే మరింత ఎక్కువ సమయం పనిచేస్తుందని అన్నారు. ఈ చుక్కల మందు ధర రూ.350.

నిజానికి.. అమెరికాలో ‘వ్యూటీ’ పేరుతో 2022లోనే ఈ తరహా ఐడ్రాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ‘ప్రెస్‌వూ’.. మనదేశంలో తయారైన మొట్టమొదటి ప్రెస్బియోపియా చుక్కల మందు కావడం విశేషం. ఈ చుక్కల మందు.. మన కన్నీటి పీహెచ్‌ విలువకు తగినట్టుగా వేగంగా తనకు తాను సర్దుబాటు చేసుకుంటుందని, కాబట్టి దీర్ఘకాలంపాటు వాడినా ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని నిఖిల్‌ తెలిపారు. ఈ డ్రాప్స్‌ తయారీలో ‘పైరోకార్బన్‌’ మాలిక్యూల్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. అమెరికాలో సెప్సిస్‌ సమస్యకు దాన్ని చాలాకాలంగా వాడుతున్నారనీ వాస్తవానికి దాన్ని రోజూ వాడడం అంత మంచిది కాదు కాబట్టి తాము దాని గాఢతను బాగా తగ్గించి.. కన్నీటి పీహెచ్‌ విలువకు దాదాపు దగ్గరగా తెచ్చినట్లు తెలిపారు. ఈ చుక్కలు వేయగానే.. అందులోని ఔషధం కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తుందని, దానివల్ల ‘డెప్త్‌ ఆఫ్‌ ఫీల్డ్‌’ పెరిగి కంటిచూపు మెరుగవుతుందని ఆయన వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.