ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్

|

Oct 12, 2024 | 9:48 AM

ఓ కోతి వల్ల ఏకంగా ఐదు గంటల పాటు కరెంటు నిలిచిపోయిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జగ్గయ్యపేట టౌన్‌లో కోతి చేష్టలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయుంది. అదీ ఐదు నిమిషాలు, పది నిముషాలు కాదు. ఏకంగా ఐదు గంటల వరకు కరెంట్ ఆఫ్ చేశారు అధికారులు. కోతి చేష్టలతో 50 వేల మందికి చుక్కలు కనిపించాయి. 33kv పోల్ ఎక్కిన కోతి దిగే వరకు విద్యుత్ సరఫరాని అపేశారు అధికారులు. కోతిని కరెంట్ పోల్ మీది నుంచి దించడానికి విద్యుత్ శాఖ ఆఫీసర్లు నానా కష్టాలు పడ్డారు.

ఓ కోతి వల్ల ఏకంగా ఐదు గంటల పాటు కరెంటు నిలిచిపోయిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జగ్గయ్యపేట టౌన్‌లో కోతి చేష్టలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయుంది. అదీ ఐదు నిమిషాలు, పది నిముషాలు కాదు. ఏకంగా ఐదు గంటల వరకు కరెంట్ ఆఫ్ చేశారు అధికారులు. కోతి చేష్టలతో 50 వేల మందికి చుక్కలు కనిపించాయి. 33kv పోల్ ఎక్కిన కోతి దిగే వరకు విద్యుత్ సరఫరాని అపేశారు అధికారులు. కోతిని కరెంట్ పోల్ మీది నుంచి దించడానికి విద్యుత్ శాఖ ఆఫీసర్లు నానా కష్టాలు పడ్డారు. కొద్దిపాటి గాలికి, వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారులకు కోతి సమస్యతో ఏకంగా ఐదు గంటలు కరెంట్ కట్ చేశారు. విద్యుత్ ఎందుకు నిలిపివేశారు? ఎప్పుడు వస్తుంది? అని అధికారులకు ఫోన్ చేసి అడిగితే… సోషల్ మీడియాలో కోతి పోల్ ఎక్కిన ఫోటో వాట్సాప్ లో పెట్టి ఇంగ్లిష్ లో మేటర్ కూడా పెట్టారు. అది చూసిన పట్టణవాసులకు మతిపోయినంత పని అయిపోయింది. కరెంట్ ఇవ్వాలంటే కోతి పోల్ దిగాలంటూ సెలవిచ్చారు సదరు అధికారులు. చేసేది లేక కోతి విద్యుత్ పోల్ నుండి దిగిపోవాలి దేవుడా అంటూ ఆంజనేయ స్వామిని వేడుకున్నారు పట్టణవాసులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ

ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు

ఈ లాభాలు తెలిస్తే.. నోని పండును అస్సలు వదలరు

 

Follow us on