Police – Farmer Videoరైతుకు హార్ట్ ఎటాక్.. సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకొచ్చిన పోలీస్.. అదిరిపోయిన వీడియో..

|

Oct 30, 2022 | 10:04 AM

ప్రాణం తీయడం ఈజీ కావొచ్చేమో!. కానీ, ఒక ప్రాణం నిలబెట్టాలంటే చాలా కష్టం. ఇకలేడు అనుకున్న మనిషిని బతికించడం ఇంకా కష్టం. అది కూడా, అకస్మాత్తుగా ఆగిపోయిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయడం ఎంత కష్టమో డాక్టర్లకే తెలుస్తుంది.

రైతుకు హార్ట్ ఎటాక్.. సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకొచ్చిన పోలీస్ - TV9
ప్రాణం తీయడం ఈజీ కావొచ్చేమో!. కానీ, ఒక ప్రాణం నిలబెట్టాలంటే చాలా కష్టం. ఇకలేడు అనుకున్న మనిషిని బతికించడం ఇంకా కష్టం. అది కూడా, అకస్మాత్తుగా ఆగిపోయిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయడం ఎంత కష్టమో డాక్టర్లకే తెలుస్తుంది. అలాంటిది, ఓ సామాన్యుడి సమయస్ఫూర్తితో ఒక ప్రాణం నిలబడింది. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో భాగంగా గామన్ వంతెనపై ఒక రైతుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఎలాంటి కదలికల్లేకుండా రోడ్డుపై విగతజీవిగా పడివున్న వ్యక్తిని చూసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రహ్మేంద్రవర్మ స్పాంటేనియస్‌గా రియాక్టయ్యారు. అతనికి వెంటనే CPR ఇచ్చి అతని ప్రాణాలను కాపాడాడు. అనంతరం చికిత్స కోసం రైతును ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉంటూ రైతు ప్రాణాలు నిలబెట్టిన ఎస్‌ఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. శెభాష్‌ ఎస్ఐ.. హాట్సాఫ్ పోలీస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 30, 2022 09:07 AM