Police Video: ఛీ ఛీ పోలీసువైయ్యుండి రోడ్డుసైడు పండ్ల షాపులో ఇదేం పని సామీ.. సీసీ కెమెరా లో రికార్డ్ వీడియో..
పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెచ్చే ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్‌లో పని చేసే పీవీ షిహాబ్.. కంజిరాపల్లిలోని ఓ రోడ్ సైడ్ దుకాణంలో మామిడి పండ్లను చోరీ చేశాడు.
పోలీసులంటే ప్రజలకు రక్షణగా నిలవాలి. కానీ వారే భక్షకులుగా మారితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. కంచే చేను మేసినట్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ దొంగ తనానికి పాల్పడ్డాడు. అది కూడా ఓ పండ్ల షాపులో. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెచ్చే ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్‌లో పని చేసే పీవీ షిహాబ్.. కంజిరాపల్లిలోని ఓ రోడ్ సైడ్ దుకాణంలో మామిడి పండ్లను చోరీ చేశాడు. ఆ దుకాణం దగ్గర కానీ, సమీపంలో కానీ ఎవరూ లేకపోవడంతో అందినకాడికి మామిడి పండ్లను బైక్ డిక్కీలో నింపేసుకున్నాడు. ఏమీ ఎరుగనట్టు చక్కగా వెళ్లిపోయాడు. కానీ ఇదంతా అక్కడే ఉన్న నిఘాకళ్లు పట్టేసాయి. సీన్ మొత్తం సీసీటీపీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. అయితే దొంగ హెల్మెట్, రెయిన్ కోట్ ధరించి ఉండడంతో మొదట అతనిని గుర్తించలేకపోయారు. కానీ బైక్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ మామిడి పండ్ల దొంగను హిహాబ్‌గా గుర్తించారు.కాగా తన కక్కుర్తి పనితో పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం షిహాబ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. కాగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే షిహాబ్ ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

