ప్లీజ్.. నన్ను పాకిస్థాన్‌కు తిరిగి పంపించొద్దు వీడియో
జమ్ముకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పలు దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్‌షా ఫోన్ చేసి... పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. వీసా సేవలు నిలిపివేయడంతో పాటు.. ఇప్పటికే వీసా తీసుకుని దేశంలో ఉంటున్న వారు సైతం భారత్ వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వివిధ కారణాలతో భారత్‌కి వచ్చిన వారంతా ఇప్పుడు అటారీ- వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్‌కు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పేరు హాట్ టాపిక్‌గా మారింది.
పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చి భారత వ్యక్తిని పెళ్లాడిన సీమా హైదర్ ఇప్పుడు మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న పాక్ మహిళ సీమా హైదర్.. రెండేళ్ల క్రితం భారత వ్యక్తిని ప్రేమించి అక్రమంగా దేశంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రేమకథ అప్పుడే సుఖాంతం అయింది. ప్రస్తుతం ఆమె ప్రియుడిని పెళ్లాడి, ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చి ఇండియాలోనే హాయిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తనను మాత్రం ఇక్కడే ఉండనీయాలని సీమా హైదర్ కోరుతోంది. తనకు పాక్‌కు వెళ్లే ఉద్దేశం లేదని, భారత్‌లోనే ఉండేందుకు తనను అనుమతించాలని కోరుతూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సీమా. తాను ఒకప్పుడు పాకిస్థాన్ పౌరురాలు అయినప్పటికీ.. ఇప్పుడు భారత కోడలిని అయినట్లు సీమా హైదర్ చెప్పుకొచ్చింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకుని హిందుత్వాన్ని స్వీకరించానని వివరించింది. సీమా హైదర్ కు దేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె లాయర్ చెప్పారు. సీమా హైదర్ భారత్‌కు వచ్చి తన ప్రియుడు సచిన్‌ను పెళ్లి చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో
ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు
గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
