థియేటర్‌లో డబుల్ కాట్ బెడ్స్.. ఏకంగా పడుకునే సినిమా చూడొచ్చు వీడియో
థియేటర్‌లో కూడా సొంతి ఇంటిలో మాదిరిగా సినిమా చూడాలని ఉందా? కాళ్లు బార్లా చాపుకుని, వీలైతే పడుకుని.. దొర్లుతూ మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎన్ని ఓటీటీలు వచ్చినా, వెబ్‌సిరీస్‌లు ముంచెత్తుతున్నా.. ‘థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా’ అంటుంది యూత్. అయితే థియేటర్లు అన్నాక కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ముందు సీట్లపై కాళ్లు పెట్టొద్దు. పూర్తిగా వెనక్కి వాలొద్దు అని రూల్స్ ఉంటాయి. అందుకే ఇంట్లోలా ఉంటామంటే థియేటర్లో అస్సలు కుదరదు మరి.
ఇప్పటి వరకు మీరు చాలానే సినిమా థియేటర్ల గురించి విని ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే థియేటర్ గురించి మాత్రం విని ఉండరు. దీని స్పెషాలిటీ ఏమంటే.. డబుల్ కాట్ బెడ్ మీద.. మెత్తటి పరుపు.. ఎంచక్కటి కుషన్లతో ఏర్పాట్లు ఉంటాయి.స్విట్జర్లాండ్‌లోని స్రీటన్‌బాక్‌లో ఉన్న సినిమా థియేటర్‌లోనివీ దృశ్యాలు. ఆ థియేటర్‌లో మెత్తటి డబుల్ కాట్ బెడ్లు పరిచేస్తారు. అక్కడ పడుకొని చూస్తారో, నిద్ర పోతారో ప్రేక్షకుల ఇష్టం. ఆ సినిమా హాలులో మామూలు సీట్లతోపాటు ఇలాంటి 11 వీఐపీ బెడ్‌సీట్లు ఉన్నాయి. అవి బుక్ చేసుకుంటే మెత్తటి దుప్పట్లతోపాటు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, పరుపులు, పక్క టేబుళ్లు కూడా ఇస్తారు. స్నాక్స్, డ్రింక్స్ కూడా ఉచితం.
మరిన్ని వీడియోల కోసం :
నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో
ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు
గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
