AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో మహిళకు పురిటి నొప్పులు.. డెలివరీ చేసిన పైలట్‌..

విమానంలో మహిళకు పురిటి నొప్పులు.. డెలివరీ చేసిన పైలట్‌..

Phani CH
|

Updated on: Mar 09, 2024 | 8:12 PM

Share

విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు పైలట్‌ విజయవంతంగా డెలివరీ చేశాడు. ఈ అనూహ్య ఘటన వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటు చేసుకొంది. అసలేం జరిగిందంటే.. తైవాన్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానంలో ఒక గర్భిణి కూడా ఉన్నారు. టేకాఫ్‌ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్‌రూంలో ఆమెను చూసిన సిబ్బంది.. విషయాన్ని పైలట్‌ జాకరిన్‌కు తెలియజేశారు.

విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు పైలట్‌ విజయవంతంగా డెలివరీ చేశాడు. ఈ అనూహ్య ఘటన వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటు చేసుకొంది. అసలేం జరిగిందంటే.. తైవాన్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానంలో ఒక గర్భిణి కూడా ఉన్నారు. టేకాఫ్‌ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్‌రూంలో ఆమెను చూసిన సిబ్బంది.. విషయాన్ని పైలట్‌ జాకరిన్‌కు తెలియజేశారు. ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సమయానికి విమానంలో వైద్యులు కూడా లేకపోవడంతో పైలట్‌ తల్లిబిడ్డలను కాపాడే ప్రయత్నం చేశాడు. ముందుగా తన బాధ్యతలను కో-పైలట్‌కు అప్పగించాడు. సెల్‌ఫోన్‌ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్‌ వారి సూచనలతో పురుడు పోశాడు. పైలట్‌ చొరవను తోటి ప్రయాణికులంతా ప్రశంసించారు. విమానంలో జన్మించిన ఈ చిన్నారికి సిబ్బంది ముద్దుగా ‘స్కై’ అని పేరు పెట్టారు. ల్యాండింగ్‌ అనంతరం తల్లిబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భర్త ఆత్మహత్యకు కారణం అదే.. వ్యక్తిగత విశేషాలు వెల్లడించిన జయసుధ

Mark Zuckerberg: సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత

ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.. మౌత్‌ వాష్‌ చేసుకోగానే ??

Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??

TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై