Kurnool: కర్నూలులో ఫలిస్తున్న వజ్రాల వేట.. 4 వజ్రాలు లభ్యం.!

|

May 29, 2024 | 7:48 PM

రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, అనంతపురం రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అందులో కొందరికి అదృష్టం కలిసి వచ్చి వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది.

రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు, అనంతపురం రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అందులో కొందరికి అదృష్టం కలిసి వచ్చి వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆ రైతు ఇంటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు.

తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేటకు వెళ్లిన ముగ్గురు రైతులకు మూడు వజ్రాలు దొరికాయి. వరుసగా మూడు రోజులు వరుసగా వజ్రాలు దొరకడంతో జొన్నగిరికి చుట్టు పక్కల ప్రాంతానుంచి కూడా ప్రజలు వజ్రాల వేటకు పోటెత్తుతున్నారు. దొరికిన మూడు వజ్రాలలో ఒకటి రూ.6 లక్షలు, ఇంకోటి 2 లక్షల 50 వేలు, మరో వజ్రం లక్షా 20 వేల రూపాయలకు జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవివకాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on