నాగుల పంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి ??

|

Aug 12, 2024 | 1:36 PM

నాగుల చవితి తెలుసు, నాగపంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి? అనుకుంటున్నారా? అవును కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తారు. కందుకూరు గ్రామంలో మాత్రం సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరీదేవిని కొలుస్తారు.

నాగుల చవితి తెలుసు, నాగపంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి? అనుకుంటున్నారా? అవును కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తారు. కందుకూరు గ్రామంలో మాత్రం సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరీదేవిని కొలుస్తారు. అలాగే ఇక్కడ తేళ్ల విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం గుట్టపై ఉన్న రాళ్ళ కోసం పరుగులు తీస్తారు. విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసిన వివిధ రకాల తేళ్లు దర్శనం ఇస్తాయి. అయితే వాటితో ఈ శ్రావణ పంచమి రోజు ఆటలు ఆడుకుంటారు అక్కడికి వచ్చే భక్తులు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తేళ్ల ను తమ శరీరం పై ఎక్కించుకుంటారు. వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అసలే తేళ్ళు విషపూరితాలు…అవి కరిస్తే ప్రమాదం కదా అనుకోవచ్చు.. అయితే దశాబ్దాలుగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఏనాడు ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని భక్తులు చెబుతున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఆ తేళ్ళు భక్తులకు హాని చేయవట. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని చెబుతున్నారు. ఇదే ఇక్కడి కొండమేశ్వరీ అమ్మవారి ప్రత్యేకత అంటున్నారు. ఇలా ప్రతీ సంవత్సరం నాగుల పంచమి నాడు కందుకూరు కొండపై పెద్ద ఎత్తున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముఖంపై ముడతలా ?? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు

విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్.. రైలు షెడ్యూలులో మార్పు

ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయద్దు..!

సత్యదేవుని ధ్వజస్తంభం బంగారు తాపడానికి.. నెల్లూరు భక్తుడి భారీ విరాళం

మామకు తలకొరివి పెట్టిన కోడలు.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘటన